వనపర్తి, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఖిల్లాగణపురం-పెద్దమందడి, గోపాల్పేట మార్కెట్ కమిటీల పాలకవర్గాలను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీఓ జారీ చేసిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఖిల్లాగణపురం-పెద్దమందడి చైర్ పర్సన్‌గా క్యామ నవనీత, వైస్ చైర్మన్‌గా కె.వెంకటేశ్వర్‌రెడ్డి, గోపాల్పేట మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ఎ.వెంకటేశ్, వైస్ చైర్మన్‌గా మంద సత్యశీలారెడ్డి, మరో 12 మంది డైరెక్టర్లతో పాలకవర్గాలను నియమించిందని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
